TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

31. ‘తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం’గా ప్రసిద్ది పొందిన పాల్కురికి సోమనాథుని కృతి ఏది?
1) పండితారాధ్య చరిత్ర
2) బసవ పురాణం
3) అనుభవసారం
4) సోమనాథస్తవం

View Answer
పండితారాధ్య చరిత్ర

32. కింది వాటిలో సరికాని జత ఏది?
) నగ్న సత్యాలు శతకం – రావికంటి రామయ్య గుప్త
2) నరసింహ శతకం – కాకుత్సం శేషప్ప కవి
3) భరతసింహ శతకం – శ్రీపతి భాస్కర కవి
4) ప్రభుతనయ శతకం – కౌకుంట్ల నారాయణ రావు

View Answer
భరతసింహ శతకం – శ్రీపతి భాస్కర కవి

33. దేవులపల్లి రామానుజరావు రాసిన ‘ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు’ ఏ ప్రక్రియకు చెందిన
రచన?
1) వ్యాస ప్రక్రియ
2) పరిశోధనా గ్రంథం
3) ఆత్మకథ
4) జీవిత చరిత్ర

View Answer
ఆత్మకథ

34. మల్లినాథ సూరి రాసిన వ్యాఖ్యానాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) కిరాతార్జునీయం-ఘంటాపథం వ్యాఖ్య
2) శిశుపాల వధ – సర్వంకుశ వ్యాఖ్య
3) నైషధం – జీవాతువు వ్యాఖ్య
4) పైవన్నీ సరైనవే .

View Answer
పైవన్నీ సరైనవే .

35. ‘శోభ’ అనే మాసపత్రిక ద్వారా సాహిత్య సేవ చేసిన వారెవరు?
1) దేవులపల్లి రామానుజరావు
2) ఆచార్య. ఎన్. గోపి
3) కపిలవాయి లింగమూర్తి
4) మాదిరెడ్డి సులోచన

View Answer
దేవులపల్లి రామానుజరావు