TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test
1. లోక్ అదాలత్ల విషయంలో సరికానిది?
1) కోర్టు రుసుములు ఉండవు
2) తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు జడ్జితో నేరుగా సంభాషించవచ్చు
3) తీర్పు వల్ల న్యాయం జరగలేదని భావిస్తే అప్పీలుకు వెళ్లవచ్చు
4) అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయసలహా అందిస్తారు.
View Answer
తీర్పు వల్ల న్యాయం జరగలేదని భావిస్తే అప్పీలుకు వెళ్లవచ్చు

2. UNO మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు ఆమోదం చింది?
1) 12 అక్టోబరు 1949
2) 26 జనవరి 1950
3) 10 డిసెంబరు 1946
4) 10 డిసెంబరు 1948

View Answer
10 డిసెంబరు 1948

3. సమాచార హక్కు చట్టానికి సంబంధించి కేంద్ర సమా చార కమిషనర్ను నియమించేది? (AP TET 2011)
1) భారత రాష్ట్రపతి
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) భారత ప్రధానమంత్రి
4) పార్లమెంట్లోని మెజారిటీ సభ్యులు

View Answer
భారత రాష్ట్రపతి

4. మైరా పైబీ ఉద్యమం విషయంలో సరైంది?
1) మైరాపైబీ’ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్లు అని అర్ధం
2) తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడా నికి ఈ ఉద్యమం మొదలైంది. తర్వాత సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మణిపూర్లో రద్దు చేయడం కోసం కొనసాగుతోంది.
3) ఈ ఉద్యమ నాయకురాలు ఇరోం షర్మిల. పై చట్టాన్ని రద్దు చేసే అంశాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీ.పి. జీవన్ రెడ్డి కమిటీని నియమించింది.
4) పైవన్నీ

View Answer
పైవన్నీ

5. సైలెంట్ వ్యాలీ ఉద్యమం విషయంలో సరైంది?
1) ఇది కేరళలోని సైలెంట్ వ్యాలీ (నిశ్శబ్ద లోయ)లో ఆనకట్టల నిర్మాణంపై వ్యతిరేక ఉద్యమం
2) ఈ ఉద్యమ కారణాలు- ఈ ఆనకట్ట వల్ల అరుదైన జంతువులు (వీటిలో సింహపు తోక కోతి ఒకటి), మొక్కలు అంతరించిపోవడం
3) ఉద్యమకర్త కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్
4) పైవన్నీ

View Answer
పైవన్నీ

1 thought on “TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test”

Comments are closed.