TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

21. పౌరుడి చట్టపరమైన బాధ్యత ఏది? (AP TET 2011)
1) పెద్దలను గౌరవించడం
2) సత్యవంతుడిగా ఉండటం
3) రాజ్యంపట్ల విధేయత కలిగి ఉండటం
4) అవసరమైన వారికి సహాయపడటం

View Answer
రాజ్యంపట్ల విధేయత కలిగి ఉండటం

22. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగే వ్యక్తి విషయంలో సరికానిది?
1) సమాచారం కావాలనే విన్నపాన్ని ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో అడగవచ్చు.
2) నిరక్షరాస్యులైన వ్యక్తి మౌఖికంగా కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు.
3) తాను ఎవరో తప్పనిసరిగా తెలియజేయాలి
4) తాను దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు.

View Answer
తాను ఎవరో తప్పనిసరిగా తెలియజేయాలి

23. న్యాయ సేవా పీఠాల చట్టం 1987 కింద ఏర్పాటు చేసింది ఏది?
1) ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
2) గ్రామ న్యాయాలయాలు
3) ఫ్యామిలీ కోర్టులు
4) లోక్ అదాలత్లు

View Answer
లోక్ అదాలత్లు

24. కిందివాటిలో సరైంది? (TS TET 2016)
1) CPI = Consumer Price Index.
2) PIL = Public Interest Litigation
3) START = Strategic Ams Reduction Treaty
4) పైవన్నీ

View Answer
పైవన్నీ

25. కిందివాటిలో సరైనవి ఎన్నుకోండి
a) సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసు కున్న వ్యక్తికి 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. జీవన్మరణానికి సంబంధించిందైతే 48 గంటల్లోపు ఇవ్వాలి.
b) సహాయ సమాచార అధికారికి దరఖాస్తు ఇస్తే అతను 35 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి.
c) దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వకపోతే మొదటి అప్పీలు 30 రోజుల్లోగా, అతను కూడా ఇవ్వకపోతే 90 రోజుల్లోగా రాష్ట్ర సమా చార కమిషనర్క రెండో అప్పీలు దాఖలు చేసుకోవచ్చు.
d) ఆంధ్రప్రదేశ్ లో స.హ.దరఖాస్తుకు గ్రామాల్లో రుసుము లేదు, మండలస్థాయిలో రూ. 5, ఆపై స్థాయిలో రూ. 10 ఉంది.
1) a, C, d
2) a, b, c
3) a, d
4) a, b, C, d

View Answer
a, b, C, d

1 thought on “TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test”

Comments are closed.