TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 మూర్తిమత్వం (Personality) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

25. సినిమాలో కథానాయిక అప్పటికే వివాహమైన కథానాయకున్ని ఇష్టపడితే అద్దంలో ఆమె అంతరాత్మ ఆమెను హెచ్చరించడం దేనికి సూచిక?
ఎ) ఇడ్ – ఈగో మధ్య సంఘర్షణ
బి) ఇడ్ – సూపర్ ఈగో మధ్య సంఘర్షణ
సి) ఈగో – సూపర్ ఈగో మధ్య సంఘర్షణ
డి) లిబిడో – ఇడ్ మధ్య ఘర్షణ

View Answer
సి) ఈగో – సూపర్ ఈగో మధ్య సంఘర్షణ

26. మనోసాంఘిక వికాస సిద్దాంతంలో – సన్నిహిత్వం – ఏకాంతం అనే మనోసాంఘీక క్లిష్టపరిస్థితులు గల వికాస దశ?
ఎ) ఉత్తర శైశవం
బి) పాఠశాల దశ
సి) కౌమార దశ
డి) పూర్వ వయోజన దశ

View Answer
డి) పూర్వ వయోజన దశ

27. భార్యా బాధితుడైన వ్యక్తి తన బాధను వ్యక్తపరచడం?
ఎ) సానుభూతి
బి) ప్రక్షేపణం
సి) వ్యక్తీకరణ
డి) విస్తాపనం

View Answer
సి) వ్యక్తీకరణ

28. తరగతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో ఉపయోగపడేది?
ఎ) ప్రజ్ఞా పరీక్ష
బి) శారీరక పరీక్ష
సి) సోషియోగ్రామ్
డి) సిరామరకల పరీక్ష

View Answer
సి) సోషియోగ్రామ్

29. కాపీ కొట్టే విద్యార్థిని ఎందుకు కాపీ కొట్టావు అని అడిగితే నాతో పాటు అందరూ కొడుతున్నారు అని చెప్పడంలో ఉపయోగించిన రక్షకతంత్రం?
ఎ) హేతుకీకరణం
బి) ప్రక్షేపణం
సి) స్వైర కల్పన
డి) విస్తాపనం

View Answer
బి) ప్రక్షేపణం

30. ఒక విద్యార్థి బడికి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది. ఆ విద్యార్థిలో కలిగిన ఆటంకం?
ఎ) శారీరక ఆటంకం
బి) మానసిక ఆటంకం
సి) భౌతిక ఆటంకం
డి) పరిసరాల ఆటంకం

View Answer
సి) భౌతిక ఆటంకం